ఆంధ్రప్రదేశ్‌

కుటుంబరావు సవాల్‌ను స్వీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై పదేపదే విమరలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేత కుటుంబరావు సవాళ్లకు సమాధానం చెప్పడానకి తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా సీనియర్ నేత పార్థసారధి స్పష్టం చేశారు. మంత్రులు చెప్పాల్సిన ప్రభుత్వ విధానాలను షేర్ బ్రోకర్‌గా గుర్తింపు పొందిన కుటుంబరావు మీడియాకు చెప్పడం చూస్తే సీఎంకు, మంత్రులకు మధ్య ఏదో తేడావస్తున్నట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల 10.5 శాతం వడ్డీకి రెండు వేలకోట్లు సేకరించినట్లు చెప్పడంపై ఆర్థిక వేత్తలు, రాజకీయ పక్షాలు ధ్వజమెత్తిన విషయం కుటుంబరావుకు గుర్తుకు రావడంలేదా అని ఆయన నిలదీశారు. వడ్డీల శాతంపై చర్చలకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ చేశారు. వైకాపా నేత జగన్ సంస్థలపై కేంద్రం విచారణ చేయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంలోని వ్యక్తులు మాట్లాడకుండా అమాంబాపతు వ్యక్తులు వివరణ ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాలో సీనియర్ నేతగా ఉన్న వంగవీటి రాధాకు పార్టీలో సముచిత స్థానం ఉన్నదని ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని ఆయన చెప్పారు. రాధాపై వైకాపా నేతకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన పార్టీ వీడుతారన్నది కేవలం పుకార్లు తప్ప మరొకటి కాదన్నారు.