ఆంధ్రప్రదేశ్‌

రాఫెల్‌పై సీబీఐ విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. ఇది అంతర్జాతీయ కుంభకోణమని, లేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న అంశమన్నారు. ‘మన్‌కీ బాత్’లో రాఫెల్ బాత్‌పై స్పష్టత ఇవ్వాలన్నారు. సాక్షాత్తు నాటి ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలన్ రాఫెల్‌పై కఠోర వాస్తవాలను వెల్లడించారని రిలయన్స్ ఢిపెన్స్ పేరును భారత ప్రభుత్వమే సిఫార్సు చేసిందని స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత పారిశ్రామికవేత్తను ప్రధాని పర్యటనలో వెంట తీసుకువెళ్లినట్లు ఆరోపణలు కూడా బహిర్గతమయ్యాయని తెలిపారు. మీడియాలో వచ్చిన ఆరోపణలు హోలన్ వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రక్షణశాఖలో అతిపెద్ద కుంభకోణం ఇదే అని వ్యాఖ్యానించారు. రాఫెల్‌పై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ జరపాలని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు స్వీకరించి విచారణ జరపాలని కోరారు. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. గతంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపిన ఉదంతాలనేకం ఉన్నాయని గుర్తుచేశారు. అదే తరహాలో అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో రాఫెల్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగాలన్నారు. దీనిపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. జాతీయ స్థాయిలో అతిపెద్ద రక్షణ కుంభకోణం జరిగితే స్పందించాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నించారు. ఇక్కడే బీజేపీ, వైసీపీ లాలూచీ బహిర్గతమవుతోందని విమర్శించారు. తన కేసుల గురించి భయంతోనే రాఫెల్‌పై మాట్లాడటంలేదని ధ్వజమెత్తారు. అన్ని జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియాలో రాఫెల్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తుంటే జగన్ మీడియా ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపైనే విషం చిమ్ముతున్నారని వీటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీపై వైసీపీ నోరు తెరవదు.. వైసీపీ గురించి బీజేపీ మాట్లాడదు.. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ఇది ఏపీని అణగదొక్కే కుట్రలో భాగమే అన్నారు. రాఫెల్ ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తోందని, బీజేపీ, వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.