ఆంధ్రప్రదేశ్‌

న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: ధర్మాబాద్ కోర్టు సమన్లు జారీ చేసిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టుకు హాజరుకాకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోయటం హేయం, దిగుజారుడు రాజకీయానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. బాబ్లీ కేసు విషయంలో సీఎం చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. న్యాయవ్యవస్థకి రాజకీయాలు ఆపాదించిన వ్యక్తి చంద్రబాబు అని, రాజకీయ లబ్ధి కోసం ఆయన ప్రతి విషయాన్నీ వాడుకుంటారని విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్య విధానాల వల్ల రాష్ట్రంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని, కాగ్ అనేక అంశాలను తప్పుబట్టిందని గుర్తుచేశారు. పెట్టుబడుల కోసం పరిశ్రమల మంత్రి లేకుండా లోకేష్ విదేశాలు వెళతారని, వ్యవసాయ మంత్రి లేకుండా సేంద్రీయ వ్యవసాయంపై మాట్లాడడానికి చంద్రబాబు వెళతారని, ప్రస్తుతం రాష్ట్రంలోని అస్తవ్యస్త పాలనకు ఈ పరిస్థితే అద్దం పడుతోందని విమర్శించారు.