ఆంధ్రప్రదేశ్‌

జంధ్యం ఉన్నంత వరకు బాబు వెంటే బ్రాహ్మణులంతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే బ్రాహ్మణుల అభ్యున్నత ముడిపడివుందని, జంధ్యం ఉన్నంత వరకు బ్రాహ్మణులంతా చంద్రబాబు వెంటే ఉంటారని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి అభ్యున్నతికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే బ్రాహ్మణ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లవుతున్నా తమ బతుకులు మారలేదని, బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు విచారిస్తున్న స్థితిలో బ్రాహ్మణుల పాలిట దైవంగా చంద్రబాబునాయుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.కోట్ల నిధులు ఇస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు బ్రాహ్మణ సమాజ ఉన్నతికి కృషిచేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున వున్న మీనాక్షి కళ్యాణ మండపంలో ఆదివారం బ్రాహ్మణ కార్పొరేషన్, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యసాధన సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం ఎంసీఎల్‌వోఓ భమిడిపల్లి వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనంద సూర్య మాట్లాడుతూ విపక్ష నేత జగన్ వెంట వెళితే చేతిలో మరో మతగ్రంథం పెడతారని ఎద్దేవాచేశారు.
ఇప్పటివరకు కార్పొరేషన్ ద్వారా 1.45 లక్షల మందికి రూ.285 కోట్లు రుణాలుగా ఇచ్చారన్నారు. సొసైటీ ద్వారా రూ.10 కోట్ల రుణాలివ్వడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం మొత్తం చంద్రబాబు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుతోనే బ్రాహ్మణ అభివృద్ధి సాధ్యమన్నారు. కొంతమంది బ్రాహ్మణులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటివారికి దూరంగా ఉండాలన్నారు.రాజమహేంద్రవరం, విశాఖ జిల్లా చోడవరంలో బ్రాహ్మణులను అవమానించిన జగన్ విశాఖ జిల్లాలో సభపెట్టి బ్రాహ్మణులకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆనందసూర్య పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బ్రాహ్మణుల ఊసే ఎత్తడం లేదన్నారు. అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కశ్యప, అహల్య పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బ్రాహ్మణుల అభ్యున్నతి, అభివ ద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే ముడిపడి ఉన్నాయన్నారు. క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పధకాలను సొసైటీ అధ్యక్షుడు శర్మ వివరించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు, డీఎల్వోలు డిహెచ్‌వి సాంబశివరావు, రాణి శ్రీనివాస్, సూరంపూడి కామేష్, ఎంసీఎల్‌వో కళ్యాణి తదితరులు మాట్లాడారు. సొసైటీ డైరెక్టర్ సోమ సుందరం, నాయకులు జగన్నాధరావు, నోరి కామశాస్ర్తీ, జి కేశవుడు, గుడిపాటి ఫణికుమార్, వడ్డాది సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.