ఆంధ్రప్రదేశ్‌

పథకాల అమల్లో ఒత్తిడి తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సాఫీగా అమలు జరగడానికి తగినంత సమయం కేటాయించి తద్వారా అధికారులు, సిబ్బందిపై పనిఒత్తిడి లేకుండా చేయాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
అధిక పనిభారంతో సతమతమవుతున్న పోలీసు, రెవెన్యూ లాంటి అనేక శాఖల్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన ఆంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి సభకు అధ్యక్షత వహించారు. కొన్ని జిల్లాల్లో ఉన్నతాధికారులు తమ పనితీరు మార్చుకోవాలంటూ ఉద్యోగులు, అధికారులు కుటుంబాలతో కలిసే అవకాశం లేకుండా రాత్రీపగలు తేడాలేకుండా వీడియో, టెలీ, సెట్ కాన్ఫరెన్స్‌లతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. అధికారులు, ఉద్యోగుల్లో ఎవరైనా తెలిసోతెలియకో తప్పుచేస్తే వారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కాని వ్యక్తిగత దూషణలతో భౌతికదాడులకు దిగటం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తగదని హితవు చెప్పారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ టీవీ ఫణిపేర్రాజు, తదితరులు ప్రసంగించారు.
నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షునిగా జీవీ నారాయణరెడ్డి (కడప), ప్రధాన కార్యదర్శిగా జీ కేశవనాయుడు (విజయవాడ), అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా డీవీకే వర్మ (కాకినాడ), ఉపాధ్యక్షులుగా వీవీ మురళీకృష్ణ నాయుడు, డాక్టర్ కే నగేష్‌బాబు (విజయవాడ), పీ కృష్ణయ్య, బీ సుధాకరరెడ్డి, డీ ప్రవీణ్ (గుంటూరు), ఎస్ జయరామప్ప (అనంతపురం), కార్యనిర్వాహక కార్యదర్శిగా కేపీ చంద్రశేఖర్ (విజయవాడ), కార్యదర్శులుగా కే విజయలక్ష్మి, మెహరాజ్ సుల్తానా (విజయవాడ), డాక్టర్ జే చైతన్య కిషోర్ (ఒంగోలు), ఎన్‌వీఎస్‌ఎస్‌ఆర్‌కే దుర్గాప్రసాద్ (కాకినాడ), డీ రాజశేఖర్ (ఏలూరు), బీ సుశీల (గుంటూరు), కోశాధికారిగా బీ కిషోర్‌కుమార్ (విజయవాడ) ఎన్నికయ్యారు.

చిత్రం..ఏపీ జేఏసీ కొత్త చైర్మన్ నారాయణరెడ్డిని సత్కరిస్తున్న బొప్పరాజు తదితరులు