ఆంధ్రప్రదేశ్‌

పదేళ్లలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 24: రానున్న పదేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదుగుతున్నదని వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోర్ నివేదికలు తెలియజేస్తున్నాయని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద 99కోట్ల రూపాయలతో నిర్మించిన పాకశాస్త్ర ప్రావీణ్య విద్యాలయాన్ని ఆయన కేంద్రమంత్రి అల్ఫోన్స్‌తో కలిసి ప్రారంభించారు. తిరుపతి పాకశాస్త్ర విద్యాలయంతో పాటు 70కోట్లతో నిర్మించిన కాకినాడ సర్క్యూట్, 60కోట్లతో నిర్మించిన నెల్లూరు సర్క్యూట్‌ను ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచంలో టూరిజం సెక్టార్ 7శాతం అభివృద్ధి ఉంటే భారతదేశం 2017లో 14శాతం అభివృద్ధి చూపిందని తెలిపారు. స్వచ్ఛ భారత్ నినాదంతో పరిశుభ్రత పాటిస్తే మంచిదని ప్రచారం చేపడితే దానిని విజయవంతం చేసింది భారత్ ప్రజలేనన్నారు. 64కళల్లో ఈ పాకశాస్త్ర ప్రావీణ్యం ఒక కళ అన్నారు. మనదేశం విభిన్న సంస్కృతులకు మూలమని, నలభీమ పాకమనేది వారసత్వం అన్నారు. మన పూర్వీకులు వాతావరణాన్ని బట్టి ఏ కాలంలో ఏమితింటే శక్తినిస్తుందని గుర్తించి ఆహార విధానాన్ని నిర్ణయించారన్నారు. నేడు ప్రారంభించిన పాకశాస్త్ర ప్రావీణ్య బోధనాలయం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నానన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మన ప్రాచీన వంటలను తిరిగి తీసుకువచ్చి దేశానికి బ్రాండ్ ఇమేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం విద్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన టూరిజం ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు.
పాకశాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభం
సభలో కేంద్ర టూరిజం శాఖ ఇన్‌చార్జి మంత్రి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద పాకశాస్త్ర విశ్వవిద్యాలయం తిరుపతిలో నిర్మించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగానే రూ. 257 కోట్లు వెచ్చించి పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సిఫార్సు మేరకు ఏపీపై ప్రత్యేక దృష్టిసారించి ఐదు ప్రాజెక్టులను రాష్ట్రంలో చేపట్టామన్నారు.
2017లో ప్రపంచ వ్యాప్తంగా టూరిజంలో భారత్ 7శాతం అభివృద్ధి సాధించగా, 2018 ఆరంభంలోనే అది 14 శాతానికి చేరిందన్నారు. నేడు 21.92 శాతానికి పెరిగిందన్నారు. మూడు సంవత్సరాల్లో 27 బిలియన్ల మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారని, రూ.1లక్ష 2.7 కోట్లు ఆదాయం కేంద్రానికి వచ్చిందన్నారు.
కేంద్రం సహకరించాలి:అఖిలప్రియ
కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే పర్యాటక రంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెడతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం సాయంత్రం రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద పాకశాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పాకశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం అదే స్థాయిలో ఇక్కడ చదువునే విద్యార్థులు అదే ప్రమాణాలతో ఆరోగ్యవంతమైన, రుచికరమైన వంటలు నేర్చుకుని తద్వారా రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్స్‌లో నాణ్యమైన వంటల తయారీతో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇలాంటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక వరమని చెప్పారు. రాష్ట్రంలో టూరిజం హోటల్స్ ప్రమాణాలను పెంచామన్నారు. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని రాయలసీమ సర్క్యూట్ అభివృద్ధికోసం రూ. 100 కోట్లు కేటాయించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కోరామన్నారు. సానుకూలంగా స్పందించి రానున్న బడ్జెట్‌లో కేటాయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు.

చిత్రం.. పాకశాస్త్ర ప్రావీణ్య విద్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు