ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ప్రకృతి సోయగాల రిసార్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్థానికులకు ఉపాధి కల్పన
* వెల్నెస్ కేంద్రాలుగా అభివృద్ధి
* వి-రిసార్ట్ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

********************

అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున రిసార్టులను ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మకమైన వి-రిసార్ట్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఈఓ అదితి బల్బీర్, మాసివ్ ఎర్త్ ఫండ్ సీఈఓ శైలేష్‌సింగ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబింబించేలా ఈ రిసార్టులను వినూత్న రీతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు తగిన రిసార్టులను కూడా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి వి-రిసార్ట్ సంస్థకు సూచించారు. ఈ రిసార్టులలో వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ విధానంలో రిసార్టులను ఏర్పాటుచేసి వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సమావేశంలో చర్చించారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తూ రిసార్టులు ఏర్పాటు చేసేందుకు వి-రిసార్టు సంస్థ ఆసక్తి కనబరచింది. భేటీలో స్థానికులకే ఎక్కువ సంఖ్యలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. సంస్థ ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో ఆతిథ్య, రిసార్టు రంగంలో పలు ప్రాజెక్టులను చేపట్టింది. వి-రిసార్టు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ముందుకొస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి వివరించారు.