ఆంధ్రప్రదేశ్‌

రాఫెల్ కుంభకోణంలో మోదీనే తొలి ముద్దాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన ముద్దాయి అని ఆంధ్రప్రదేశం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని లెనిన్ సెంటర్‌లో ఈ కుంభకోణంపై నిరసన కార్యక్రమం, మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా ఊమెన్ చాందీ మాట్లాడుతూ అన్ని రాష్ట్ర రాజధానుల్లో రాఫెల్ కుంభకోణంపై గవర్నర్లకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. రాఫెల్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియామకానికి కేంద్రం ఎందుకు వెనుకాడతోందని ఆయన ప్రశ్నించారు. విమానం ఖరీదు రూ. 526 కోట్ల నుంచి రూ. 1611 కోట్లకు ఎలా పెరిగిపోయిందో చెప్పాలని ఊమెన్ చాందీ డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేరళ వరద బాధితుల కోసం వెయ్యి ఇళ్లు నిర్మిస్తున్నామని, అందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రూ. 5లక్షల చెక్ అందజేశారని చెప్పారు. అక్టోబర్ 2 నుండి మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా ప్రతి ఇంటికీ వెళతామని, కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ దేశానికి చేసిన సేవలతో పాటు టీడీపీ, బీజేపీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ నెల 20న గవర్నర్ నరసింహంకు ఉత్తరం రాశామని, రాఫెల్ కుంభకోణంపై మీద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వాలని, విజయవాడకు రమ్మంటారా? అమరావతికి రమ్మంటారా చెప్పాలని అడిగితే గవర్నర్ నుంచి ఇంతవరకు సమాధానం లేదన్నారు. దీంతో సోమవారం ఇక్కడ నిరసన తెలియజేశామన్నారు. రాష్టప్రతికి రాసిన ఉత్తరాన్ని తప్పని పరిస్థితిలో గవర్నర్ ద్వారా పంపాలి కనుక మెయిల్ చేశామని రఘువీరారెడ్డి వివరించారు.