ఆంధ్రప్రదేశ్‌

మోదీపై విపక్షాల దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: జరగని కుంభకోణాన్ని జరిగినట్లుగా లల్లూ ప్రసాద్ యాదవ్, చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారంతో నిజం చేయాలకి ప్రయత్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు గాలిపోగేసి అబద్ధాన్ని ప్రచారం చేయటం అలవాటని, దాన్ని ప్రస్తుతం రాహుల్ గాంధీకి అంటగట్టారన్నారు. చంద్రబాబుతో స్నేహం చేయడం వల్ల అతని లక్షణాలు రాహుల్ గాంధీకి అలవడ్డాయన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అక్రమం జరిగిందనే గాలివార్తలతో మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ రక్షణ వ్యవస్థ మెరుగుపడకూడదని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రాఫెల్ విషయంలో దేశానికి, ప్రైవేట్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. యుపీఏ ప్రభుత్వం నేరుగా యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడానికే పరిమితమైందని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం విమానాలతో పాటు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, శిక్షణ, విడిభాగాలు భారత్‌లో తయారీ వంటి అంశాలపై ఒప్పందం చేసుకుందని కన్నా వివరించారు. కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలు దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కాకూడదని పొరుగు దేశాలతో కుట్రపన్ని మోదీకి స్కాంలు అంటగట్టాలని చూస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.