ఆంధ్రప్రదేశ్‌

నోటిదురుసు తీరడానికే జగన్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రజాసమస్యలపై కాకుండా నోటిదూల తీర్చుకోవడంతో పాటు వైఎస్ డబ్బా కొట్టుకోవడానికి సాగుతోందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. సోమవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ కరణం బలరాంతో కలిసి మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో సోమవారం మాట్లాడిన మాటలు వింటే ప్రజల సమస్యలపై కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ పోలవరం పునాదులు దాటలేదని అనటం అన్యాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు 2009 నుంచి 2013 వరకు ఆలస్యం కావడానికి కారకులే జగన్, వైఎస్ ఆత్మ అని విమర్శించారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత 2015లో పోలవరం ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తే జగన్‌కు ఇవి కనబడడం లేదా? అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 58.55 శాతం పనులు పూర్తిచేయగా హెడ్ వర్క్స్ పనులు 45.8 శాతం, ప్రధాన డ్యామ్ పనులు 44.56 శాతం, రేడియల్ గేట్లు నిర్మాణం 61.84 శాతం, మట్టి పనులు 78 శాతం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తికాగా జెట్‌గ్రోటింగ్ పనులు 94.4 శాతం, రైట్ మెయిన్ కెనాల్ పనులు 90 శాతం, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 63.77 శాతం పూర్తి అయ్యాయన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించడానికి అమెరికా పర్యటనకు వెళితే ఈర్ష్యగా చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని కూడా మంత్రి ఉమా విమర్శించారు.
జగన్‌ది టైంపాస్ యాత్ర:రవీంద్ర
అవినీతి నాయకుడు జగన్మోహన్‌రెడ్డి 30వేల కి.మీలు నడిచినా ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం జగన్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకున్న పాపం పొర్లుదండాలు పెట్టినా పోదని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని, 16నెలలు జైలు జీవితం అనుభవించి, ఈడీ కేసుల్లో ఆస్తుల జప్తులు జరిగిన వ్యక్తి, అవినీతి గజదొంగ పాదయాత్ర చేస్తున్నారంటే ప్రజలు నమ్ముతారా అని రవీంద్ర ప్రశ్నించారు. శుక్రవారం వస్తే బోనెక్కాలి, కోర్టు చుట్టూ తిరగాలని విమర్శించారు. పాదయాత్ర అంటే విలువలుండాలని, గతంలో చంద్రబాబు చేసిన యాత్రకు, అనేక మంది పెద్దలు చేసిన యాత్రలకు విలువలున్నాయన్నారు. జగన్ ఎందుకు యాత్ర చేస్తున్నారో ఎవరికీ తెలియదన్నారు. ఆయనది మార్నింగ్, ఈవినింగ్ వాక్ అని రవీంద్ర విమర్శించారు. 3వేల కి.మీల పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వం, మోదీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయంపై ఎక్కడన్నా నోరెత్తి ఒక్కమాట మాట్లాడారా అని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కుంభకోణం రాఫెల్‌పై ఒక మాటైనా మాట్లాడని మీకు విలువలున్నాయా? ప్రజలు ఎలా విశ్వసిస్తారు? రాబోయే కాలంలో మీకు ప్రజలే బుద్ధి చెపుతారని రవీంద్ర హెచ్చరించారు. అంతకుముందు మావోయిస్టులో ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేలి సోమ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.