ఆంధ్రప్రదేశ్‌

అమెరికా కంటే ఏపీనే బాగుందనిపిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 24: ‘అమెరికా కంటే మా ఊరే బాగుంది. అక్కడికే వెళ్తాం.. అని మీతో అనిపిస్తాం. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో టీడీపీ ఎన్నారై సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రధానంగా ప్రవాసాంధ్రులను ఆకట్టుకునే ప్రసంగాలు సాగాయి. ముందుగా మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమతో పాటు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకునేవాడినని, కానీ మళ్లీ రాలేమనే భావనతో పర్యటన కొనసాగిస్తున్నానని చెప్పారు. మీ అందర్నీ నిరాశపరచటం ఇష్టంలేదని చెప్తూ ఐక్యరాజ్య సమితి వేదికగా ఏపీ రైతుల నైపుణ్యాన్ని వివరించే అవకాశం కూడా మళ్లీ రాదనే పర్యటన రద్దు చేసుకోలేదని తెలిపారు. ఆకాశమే హద్దుగా అవకాశాలనేకం ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. నచ్చిన రంగంలో రాణించి అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగంతో సరిపెట్టుకోవటం కాదని, ప్రతి తెలుగువాడు ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలా ఎదగాలన్నారు. ఏ గడ్డపై అయినా ఘనత వహించిన చరిత్ర తెలుగు జాతిదన్నారు. చంద్ర మండలంలో సైతం తెలుగు జెండా ఎగురవేయగలిగే శక్తిసామర్థ్యాలు మనకు ఉన్నాయన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతుబిడ్డలను నాలెడ్జి ఎకానమీలో భాగస్వాములను చేశామన్నారు. ఒకానొకప్పుడు ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్ నగర వీధుల్లో పురుగులెత్తిన సంఘటనలు మనసులో కదులుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై టీడీపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో ఉన్నామా? అమరావతిలో ఉన్నామా? అనే భావన కలుగుతోందన్నారు. ఏపీని మించిన ఉత్సాహం ఇక్కడ పరవళ్లు తొక్కుతోందని అభివర్ణించారు. పసుపు చొక్కాలు, పసుపు కండువలు, పసుపు జెండాలతో అమెరికాను సైతం పసుపు మయం చేశారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుతోనే కాదు లోకేష్‌తో కలసి సహచర మంత్రిగా మూడుతరాల నేతలతో పనిచేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు అగ్రగామిగా నిలిచామన్నారు. నదుల అనుసంధానం దేశానికే ఆదర్శమన్నారు. గ్రామీణాభివృద్ధి, ఇంధనశాఖ, జలవనరుల రంగాల్లో అనేక అవార్డులు సాధించామని తెలిపారు. అయినా ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. 12 కేసులలో ఏ వన్ ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పవన్‌కళ్యాణ్ పెళ్లిళ్లను కూడా అవహేళన చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు.
కాగా ఎన్నారైలు చంద్రబాబును అభినందనలతో ముంచెత్తారు. టెక్నాలజీలో ఓనమాలు దిద్దించిన టెక్ గురుగా అభివర్ణించారు. భావితరాలకు ఆయన మార్గదర్శకుడన్నారు.
ఎన్నారైల ప్రస్థానంలో చంద్రబాబుకో పేజీ ఉందన్నారు. సమావేశంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు వేమూరి రవికుమార్, బుచ్చిరాంప్రసాద్, టీడీపీ ఎన్నారై నేతలు మన్నవ మోహనకృష్ణ, వేమన సతీష్, జై తాళ్లూరి, శ్రీనివాస్ గుత్తికొండ, సినీనటి లయ తదితరులు ప్రసంగించారు.