ఆంధ్రప్రదేశ్‌

నాటి రైతుల శ్రమకు నేడు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 24: ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన ప్రకృతి సేద్యం దశాబ్దకాలం రైతుల శ్రమకు ప్రతిఫలమని వ్యవసాయరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. రైతులు ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం రసాయనిక ఎరువుల ధరల్లో భారీ పెరుగుదలేనని వారు అభిప్రాయపడుతున్నారు. 12 సంవత్సరాల క్రితం ఎరువుల కొరత, ధరల పెరుగుదల కారణంగా రైతులు స్వయంగా సహజ ఎరువులను తయారు చేసుకునే పరిస్థితికి దారితీసిందని వారంటున్నారు. రాష్ట్రంలో 2006లో పెద్దఎత్తున ఎరువుల కొరత ఏర్పడింది. ఆ రోజుల్లో రైతులు రోజుల తరబడి రసాయనిక ఎరువుల దుకాణాల ముందు నిలబడి అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితిని వారు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత పలురకాల కారణాలతో రసాయనిక ఎరువుల ధరల్లో పెరుగుదల వల్ల రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితిని కల్పించింది. దాంతో ప్రకృతి సేద్యం వైపు రైతులు దృష్టి సారించారని వారంటున్నారు. రాష్ట్రంలో పదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సహజ ఎరువుల తయారీని ప్రారంభించాలని రైతులకు సూచించిందని వారంటున్నారు. నాడు రైతులు వర్మీ కంపోస్టు పేరుతో సహజ ఎరువుల తయారీని ప్రారంభించి దాన్ని పొలాల్లో వినియోగించే విధానం ప్రారంభించారు. అయితే రైతులు వేస్తున్న పంట విస్తీర్ణానికి వర్మీ కంపోస్టు ఉత్పత్తి ఏ మాత్రం సరిపోలేదు. దీంతో వారు ఆ తరువాతి కాలంలో వర్మీ కంపోస్టు ఉత్పత్తిని పెద్దగా పట్టించుకోకుండా రసాయనిక ఎరువులనే వాడుతూ వచ్చారు. సహజ ఎరువుల తయారీకి ప్రధానంగా పశువులు విసర్జించే వ్యర్థాలు చాలా అవసరం. అయితే ప్రస్తుతం రైతులు పశుపోషణకు దూరంగా ఉండటం వల్ల వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ కష్టంగా మారింది. అంతేగాక సహజ ఎరువులను తయారు చేసుకుని వాటి ఆధారంగా పంటలు సాగుచేస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉండవని రైతులు అభిప్రాయపడేవారు. అంతేగాక పంట ఉత్పత్తులకు రెండు, మూడు రెట్లు అధిక ధరకు విక్రయిస్తే గానీ గిట్టుబాటు కాదని ఆవేదన వ్యక్తం చేసేవారు. అంత ధర పెట్టి కొనుగోలు చేయలేని సామాన్యుడు రసాయనిక ఎరవుల ద్వారా పండిన పంట ఉత్పత్తులు కొనేందుకే ఆసక్తి చూపుతూ వచ్చాడు. దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో 1.2 కోట్ల మంది రైతులు ఉండగా వారిలో కేవలం 5 లక్షల మంది మాత్రమే ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు కూడా కేవలం 5.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సహజ ఎరువులను వినియోగించి పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో కూడా ప్రకృతి సేద్యంపై ఆసక్తి ఉన్న రైతులు తమ ఇంటి అవసరాల కోసం ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో మాత్రమే వరి, కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం పట్ల రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ఆ మేరకు వ్యవసాయరంగ నిపుణులకు సూచనలు జారీ చేసింది. ప్రకృతి వ్యవసాయంలో సహజ సిద్ధమైన ఎరువులు వినియోగించేందుకు అవసరమైన పశువులను రైతులకు అందించడం కోసం పలు కార్యక్రమాలు సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. రైతులు ఒక వైపు పంటల సాగు, మరోవైపు పశుపోషణకు ప్రాధాన్యత ఇస్తే సహజ ఎరువుల తయారీకి ఇబ్బందులు తొలిగిపోవడమే కాకుండా రెండువైపులా ఆదాయం సమకూరే అవకాశం ఉందని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రకృతి సేద్యం చేయాలన్న ఆలోచన దిశగా రైతులు అడుగులు వేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఐరాస నుంచి ఆహ్వానం రావడంతో మరింత వేగంగా ప్రకృతి వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కోటి ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.