ఆంధ్రప్రదేశ్‌

న్యాయ కోవిదుడు పాటిబండ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 11: భారతదేశం గర్వించదగ్గ న్యాయ కోవిదుడు పాటిబండ్ల చంద్రశేఖరరావు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కొనియాడారు. పాటిబండ్ల చంద్రశేఖరరావు మృతి పట్ల ఎంపీ కనకమేడల నివాళులర్పించి ప్రగాడ సంతాపం తెలిపారు. పాటిబండ్ల మృతితో దేశం ఒక గొప్ప న్యాయకోవిదుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ముగ్గురు ప్రధానుల వద్ద పనిచేసిన న్యాయవాది పాటిబండ్ల అని, ఆయన మృతి భారత న్యాయశాస్త్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఇటలీ, చైనా, మెరైన్ డిస్ప్యూట్ ఆర్బిట్రేటర్‌గా, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ది సీ జడ్జిగా, భారత న్యాయ మంత్రిత్వశాఖలో పలు పదవుల్లో సేవలందించి, చేసిన ప్రతి పదవికి వనె్న తెచ్చారని ఎంపీ కనకమేడల పేర్కొన్నారు.