ఆంధ్రప్రదేశ్‌

రేపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై జనసేన కవాతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: జనసేన పార్టీ ఏపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ప్రదర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా ఎంచుకుంది. ఏపీ ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, హామీలు, మ్యానిఫేస్టో అంశాలు నెరవేరలేదని నిరసిస్తూ గోదావరి సాక్షిగా జనసైనికులు కవాతుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 15వ తేదీన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై రెండున్నర కిలో మీటర్ల మేర కవాతు సాగనుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జన సైనికులు, వీర మహిళలు ఈ కవాతుకు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కవాతు పర్యటన కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ నేతృత్వంలో పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కవాతు అనంతరం బ్యారేజీ దిగువన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కవాతు లక్ష్యాన్ని జనసేన అధినేత పవన్ వివరించనున్నారు. బ్యారేజీ పొడవు సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం ఎనిమిది కిలో మీటర్ల మేర ఇటు విజ్జేశ్వరం మొదలుకొని ధవళేశ్వరం వరకు బ్యారేజి మొత్తం జనసైనికులు కవాతు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం బ్యారేజీ దిగువన ధవళేశ్వరం జంక్షన్‌లో కాటన్ విగ్రహం వద్ద జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.