ఆంధ్రప్రదేశ్‌

ఎర్రమల కొండల భూ పొరల్లో మంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, అక్టోబర్ 13: కర్నూలు జిల్లాలో విస్తరించిన ఎర్రమల కొండల్లో భూమి పొరల్లో మంటలు వస్తున్నాయి. అవుకు మండల పరిధిలోని కునుకుంట్ల మజారా గ్రామమైన మర్రికుంటతండా సమీపంలో ఎర్రమల కొండల్లో భూమి పొరల నుంచి మంటలు వచ్చాయి. గత రెండు రోజులుగా చీలిన భూమి పొరల నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో తహశీల్దార్ సంజీవయ్య శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భూమి నుంచి వస్తున్న మంటలను పరిశీలించారు. కొండల్లోని భూమి పొరల నుంచి గత రెండు రోజులుగా మంటలు వస్తున్నట్లు స్థానికులు తెలిపారన్నారు. సుమారు 2 మీటర్ల మేర వేడి అధికంగా ఉందన్నారు. ఇనుప స్తంభం ఒకటి వేడి తీవ్రతకు కరిగి కిందపడిపోయిందని తెలిపారు. వేడి ఎక్కువ గా ఉండడంతో ఇనుప స్తంభం కరిగిపోయిందన్నారు. ఈ విషయాన్ని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు.