ఆంధ్రప్రదేశ్‌

సెక్రటేరియేట్ కేరాఫ్ పలాస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 13: జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ రౌండ్ ది క్లాక్ విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం జిల్లాలో ఇదే ప్రథమం. ముఖ్యమంత్రి పిలుపుతో డిప్యూటీ సి.ఎం. నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పితాని సత్యనారాయణ, నారా లోకేష్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు విజయానంద్, అజయ్‌జైన్, నీరపుకుమార్‌ప్రసాద్, పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరితోపాటు 50 మంది ఐఎఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు, 136 మంది ఉన్నతాధికారులతో పలాసలో మినీ సెక్రటేరియేట్‌ను ముఖ్యమంత్రి నడుపుతున్నారు. 2014లో సంభవించిన హుదూద్ తుపానుకు విశాఖ జిల్లా దెబ్బతిన్నప్పుడు సీఎం చంద్రబాబు విశాఖలో ఉండి ఇదేవిధంగా రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులను, మంత్రులను రప్పించి యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాలను తుపాను విపత్తు పూర్తిగా కకావికలం చేసింది. దీంతో అక్కడ ప్రజలు మనోధైర్యం కోల్పోయి సాయం కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి నెలకొంది. ఇటువంటి కుటుంబాలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మూడు రోజులుగా పలాసలోనే బస చేస్తూ అమరావతి నుంచి సెక్రటేరియేట్‌ను ఇక్కడకు మార్చేయడంతో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు విశాఖపట్నం, విజయనగరం, జిల్లాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు సహాయక చర్యలు అందించేందుకు గ్రామాలను చుట్టుముడుతున్నారు. బాధిత గ్రామాల్లో తాగునీరు, ఆహారం, నిత్యావసర వస్తువులు పౌరులకు అందేలా చర్యలు వేగవంతం చేస్తున్నారు.

చిత్రం..పలాస మున్సిపల్ కార్యాలయలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు