ఆంధ్రప్రదేశ్‌

తుపాను సహాయక చర్యలపై ప్రజల్లో అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న తుపాను పునరావాస, సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తికరంగా లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తుపాను సహాయక చర్యలపై ఆదివారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రతి ఒక్కరిలో సంతృప్తి రావాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉండాలని సూచించారు. 100 శాతం ప్రజల సంతృప్తే ధ్యేయంగా పనిచేయాలన్నారు. శనివారంతో పోలిస్తే మంచినీటి వసతిపై 7శాతం, భోజన ఏర్పాట్లపై 5శాతం సంతృప్తి పెరిగిందని చెప్పారు. నీటికి సంబంధించి సంతృప్తిని 80 శాతానికి పెంచాలన్నారు. భోజన ఏర్పాట్లలోనూ అది పెరగాలన్నారు. రాకపోకల పునరుద్ధరణపై 8 శాతం పెరిగిందని, విద్యుత్ పునరుద్ధరణ పనులపై 17శాతం పెరిగిందన్నారు. అధికారుల పనితీరుపై 8శాతం మాత్రమే పెరిగిందన్నారు. దీనిని మరింతగా పెంచుకోవాలన్నారు. మంగళవారం తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాని, తాను వచ్చేసరికి పరిస్థితులు మెరుగుపడాలన్నారు. సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆదేశించారు. తుపాను సహాయక చర్యల్లో కీలకమైన మంచినీటి సరఫరా, భోజన ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు కీలకమని, వీటిలో లోపాలు ఉండకూడదన్నారు. ప్రతి గ్రామాన్ని అధికారులు స్వయంగా సందర్శించి సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ సరఫరా లేనిచోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. నీళ్లు ఇవ్వలేకపోయారన్న చెడ్డపేరు రాకూడదన్నారు. యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా జరగాలన్నారు. నిత్యావసరాలు పంపిణీ జరిగేదాకా భోజనం సరఫరా చేయాలన్నారు. భవన శిథిలాలను వెంటనే తొలగించాలని, పంటనష్టం అంచనాలు ముమ్మరం చేయాలన్నారు. పారదర్శకంగా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. సోమవారం సాయంత్రానికి కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఇది అతిపెద్ద విపత్తు అని, జిల్లా మొత్తం అస్తవ్యస్తం అయిందన్నారు. బాధితులను ఆదుకోవడమే మన కర్తవ్యమని, ప్రతిపక్షం ఆరోపణలు అర్థరహితమని వ్యాఖ్యానించారు. చేతనైత సహాయం చేయండని, ఒడ్డున ఉండి గడ్డలు వేయవద్దని హితవు పలికారు. సహాయక చర్యలకు ఆటంకాలు కల్పిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. పని చేయనివ్వకుండా అడ్డుపడితే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
చిత్రం..తుపాను సహాయక చర్యలపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు