ఆంధ్రప్రదేశ్‌

రూ. 10 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ బ్యాంక్‌ల నుంచి 10 వేల కోట్ల రూపాయలను రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ రుణానికి గ్యారంటీర్‌గా వ్యవహరించనున్నట్లు సీఆర్‌డీఏకు తెలిపింది. ఈ రుణాన్ని, వడ్డీని సీఆర్‌డీఏ చెల్లించాల్సి ఉంటుందని సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్టీసీ 500 కోట్ల రూపాయల మేరకు రుణం సమకూర్చుకునేందుకు కూడా ప్రభుత్వం గ్యారంటీర్‌గా వ్యవహరించనుంది.
ఎకరాకు రూ.25 లక్షల నష్టపరిహారం
మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టుకు సంబంధించి భూసేకరణలో కీలక నిర్ణయం సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ పోర్టు నిర్మాణానికి 2159 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. సంప్రదింపుల కమిటీ సిఫారసు మేరకు ఎకరాకు 25 లక్షల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించి, ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.