ఆంధ్రప్రదేశ్‌

కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు అర్ధాకలితో అలమటించే వారని, నేడు రాష్ట్భ్రావృద్ధిలో కీలకపాత్ర పోషించే కార్మిక సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కేశినేని నాని తెలిపారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పోలవరం నుండి అమరావతి వరకు జరుగుతున్న అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. వారి సంక్షేమం కోసం చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, ఎన్‌టిఆర్ వైద్య సేవ వంటివి ప్రవేశపెట్టి కార్మికులకు అండగా నిలుస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోతలతో మూడు లక్షలకు పైగా పరిశ్రమలు మూతపడి 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. నేడు ఎక్కడా కోతలు లేకుండా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను పరిశ్రమలకు అందజేస్తోందన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశావర్కర్లకు వేతనాలు పెంచామన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం ద్వారా భరోసా కల్పిస్తున్నది తమ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రెండున్నర కోట్ల మంది ఈ బీమా కింద పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఇప్పటికే 1,91,176 మంది కార్మికుల కుటుంబాలకు చంద్రన్న బీమా కింద సహాయం అందజేశామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ వాటాగా రూ.840 కోట్లు ఇచ్చిందన్నారు. కార్మికుల సమస్యలను ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించే నూతన విధానానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.