ఆంధ్రప్రదేశ్‌

రంగంలోకి సీపీసీఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి, జీడిమామిడి తదితర తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేరళకు చెందిన సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) ముందుకు వచ్చింది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్సుహాల్‌లో సీఎం చంద్రబాబు నాయుడును సోమవారం ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప కలిసి తమ ప్రణాళిక వివరించారు. శ్రీకాకుళంలో కొబ్బరి రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మరి కొన్ని కేంద్ర వనాల పరిశోధనా సంస్థలతో కలిసి పర్యటించి, నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తామన్నారు. తుపాను కారణంగా కొబ్బరి, జీడిమామిడి తోటలకు సోకే వైరస్, తెగుళ్లు నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని డైరక్టర్ తెలిపారు. డ్రోన్‌ల ద్వారా ఆయా తోటల్లో పురుగుమందులు చల్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. సామర్లకోటలో తమ సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. శ్రీకాకుళంలో తుపానులు తట్టుకునేలా కొబ్బరి సాగు వీలుగా తమ పరిశోధనలు సాగుతాయన్నారు. సర్వం కోల్పోయిన కొబ్బరి రైతులకు తిరిగి పంట వేసేందుకు వీలుగా కొబ్బరి విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. అధిక దిగుబడికి తమ పరిశోధనల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగుకు తగిన సూచనలు, సలహాలు ఇస్తామన్నారు.