ఆంధ్రప్రదేశ్‌

విమర్శించడమే వారి పని: కనకమేడల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: తెలుగుదేశం నాయకులపై ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రతి దానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులపై జీవీఎల్ రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్‌ను వ్యక్తిగతంగా విమర్శించాలంటే చాలా ఉన్నాయి.. కానీ వాటి జోలీకి పొదల్చుకోలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంపై జీవీఎల్ చేసిన ఆరోపణలపై చర్చకు తమ పార్టీ సిద్ధమని కనకమేడల సవాల్ విసిరారు. రాజకీయాల్లో విమర్శలు చేయాలి కానీ.. విమర్శే పనిగా పట్టుకుని ఆలోచనా రహితంగా ఆరోపణలు చేయవద్దని జీవీఎల్‌కు సలహా ఇచ్చారు. ఏన్టీయే నుంచి బయటకు రాగానే తెలుగుదేశం పార్టీ అవినీతిమయం అయిందా? బీజేపీతో కలిసి ఉన్నంతకాలం అవినీతి ఆ పార్టీ నాయకులకు కనపడలేదా? అని ఆయన ప్రశ్నించారు. గత నాలుగేళ్ల కాలంలో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులే కేంద్రం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని.. ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్రంపై కనకమేడల మండిపడ్డారు.