ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయంలో మహిళలదే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: మన దేశంలో ప్రాచీన కాలం నుంచి వ్యవసాయంలో మహిళలే కీలకపాత్ర పోషిస్తున్నారని అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల వారిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని ఒక కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళా రైతు దినోత్సవం - 2018 కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత మంత్రులు రాష్ట్ర స్థాయి మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, నూతన యంత్ర పరికరాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రత కల్పించడంలో గ్రామీణ మహిళలు పోషిస్తున్న పాత్ర ఎనలేనిదన్నారు. ప్రాచీన కాలం నుంచి కూడా దేశంలో వ్యవసాయంలో మహిళల పాత్ర ప్రాముఖ్యమైందని, పంటలు పండించడంలో వారు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారన్నారు. వ్యవసాయాభివృద్ధిలో 32 శాతం మహిళల పాత్ర ఉందని ఆహారం, వ్యవసాయ సంస్థ తెలియజేసిందన్నారు. వ్యవసాయ శ్రామిక శక్తిలో 43 శాతం మహిళల ద్వారానే లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించడానికి రూ. 10 లక్షల రుణ సదుపాయంలో మహిళలు రూ. 2 లక్షలు చెల్లిస్తే మిగతా రూ. 8లక్షలు సబ్సిడీగా ఇస్తుందన్నారు. అదే కోటి రూపాయల రుణ సదుపాయం అయితే రూ. 50 లక్షలు సబ్సిడీగా అందిస్తున్నామని మిగతా రూ. 50 లక్షలు మహిళలు ఒక గ్రూప్‌గా ఏర్పడి పొందవచ్చన్నారు. 2017-18 సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణలో రూ. 254 కోట్ల రాయితీతో 81,124 మంది మహిళలకు లబ్ధి కల్పించామన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రైతు దినోత్సవం అన్ని జిల్లాల్లో నిర్వహించడం వల్ల వారిలో స్ఫూర్తి వస్తుందన్నారు. మహిళలను ప్రోత్సహించడానికి వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, డెయిరీ రంగాల్లో మహిళలకు అవార్డులు ఇవ్వడం స్ఫూర్తిగా నిలుస్తుందని, ఈ అవార్డులు పొందిన మహిళలు చాలా శక్తివంతంగా తయారు కావడంతో పాటు భవిష్యత్‌లు బాటలు వేసుకుంటారన్నారు. మహిళా రైతు దినోత్సవం - 2018 సందర్భంగా ఉత్తమ మహిళా రైతు అవార్డులను కృష్ణాజిల్లాలో 8 మందికి రాష్ట్రంలో 21 మందికి అందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, వ్యవసాయ శాఖ కృష్ణా జిల్లా జెడీ మోహన్‌రావు, ఏడీ సునీల్, డీడీ బాబునాయక్, వివిధ జిల్లాల నుంచి మహిళా రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు తదితరులు పాల్గొన్నారు.