ఆంధ్రప్రదేశ్‌

అరిషడ్వర్గాలను జయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 12: అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుందని కంచికామకోటిపీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా మంగళవారం ఒంగోలుకు వచ్చిన ఆయనకు టిటిడి కల్యాణమండపంలో టిటిడి అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. కల్యాణ మండపంలో స్వామివారి కంచి పీఠంలో కొలువైన స్వామికి అభిషేకాదులు, పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా శంకరవిజేయేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆదిశంకరున్ని ఆరాధించటం వలన మనసులో ఉన్న మాలిన్యాలు తొలగి మనిషి భగవత్ స్వరూపుడిగా మారుతారన్నారు. దేవునిసేవలతోపాటు మానవసేవ చేయాలని ఆయన భక్తులకు బోధించారు. ధార్మికచింతనను ప్రతిఒక్కరు అలవాటుచేసుకోవాలని, హిందూసాంస్కృతిక సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, జూలై 12: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలవిరాట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు,పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితోశుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.