ఆంధ్రప్రదేశ్‌

హృదయ విదారకంగా తిత్లీ బాధితుల గోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 15: తుపాను ప్రభావిత ప్రాంతాలలో బాధితుల గోడు హృదయ విదారకంగా ఉందని, భవిష్యత్తుపై బెంగపడుతున్న బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడమే కాకుండా మారుమూల గ్రామాలకు సైతం సహాయచర్యలను విస్తరింపచేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. రఘువీరా నేతృత్వంలో కిల్లి కృపారాణి, ద్రోణంరాజు శ్రీనివాస్, విశ్వప్రసాద్, కిల్లి రామ్మోహన్‌రావు, తదితర నేతలతో కూడిన పీసీసీ బృందం శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ మేరకు అక్కడి పరిస్థితులను వివరిస్తూ తక్షణమే బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం సహాయచర్యలను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రఘువీరా సోమవారం లేఖ రాశారు. మందస, కవిటి, కంచిలి మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో తుపాను తీవ్రత గురించి ప్రభావిత ప్రాంత ప్రజలకు ముందుగా హెచ్చరికలు చేయడంలోనూ, నష్టాలను నివారించడంలోనూ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించినప్పటికీ ప్రధాన రహదారుల వెంబడి మాత్రమే ప్రజలకు సహాయక, పునరావాస చర్యలు కొంతమేరకు జరుగుతున్నాయే తప్ప మారుమూల గ్రామాల ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదన్న విషయం తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూనే కేంద్రీకరించి పనిచేయడం వలన మూల గ్రామాలలో సహాయక చర్యలు చేపట్టడంలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలే స్వతంత్రంగా పునరావాస, సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వం చేరుకోని, తొంగి చూడని గ్రామాలు అనేకం ఉన్నాయన్నారు. తక్షణమే స్పందించి ప్రభుత్వ సహాయక చర్యలు మారుమూల గ్రామాలకు సైతం చేరే విధంగా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. చనిపోయిన పాడి గేదలకు 50వేలు, మేక, గొర్రెలకు 5వేల చొప్పున ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లించాలని కోరారు.