ఆంధ్రప్రదేశ్‌

స్వైన్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు ఎక్కువ అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్రత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 27 కేసులు నమోదు అవడం ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితిని గమనించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులను, మాస్కులను, ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా సోమవారం టెలీ కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజులకు మించి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్న వారు అప్రమత్తమవ్వాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన్ బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లలో స్లైన్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వచ్చే చిత్తూరు, విశాఖ, విజయవాడల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మూడు చోట్ల విమానాశ్రయాల్లో కూడా నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబర్‌లో 27 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. చిత్తూరులో 9, విశాఖలో 16, అనంతపురం, కడప, కృష్ణా, తదితర జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యవంతులెవరూ వారి దగ్గరకు వెళ్లవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా టామీఫ్లూ ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిదన్నారు. జికా వైరస్ కూడా దేశంలోకి ప్రవేశించిందని, రాజస్థాన్‌లో 23 కేసులు ఇప్పటికే నమోదయ్యాయని తెలిపారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఉందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు.