ఆంధ్రప్రదేశ్‌

మంత్రి యనమల పేరుతో నకిలీ ఉద్యోగ సిఫార్సు లేఖ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేరుతో నకిలీ ఉద్యోగ సిఫారసు లేఖను ఒక వ్యక్తి సృష్టించాడు. ఈ లేఖ సృష్టించింది పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత కారు డ్రైవరు కావడం గమనార్హం. విద్యుత్ శాఖలో షిప్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి పేరుతో ఒక సిఫారసు లేఖను ఈమెయిల్ ద్వారా ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావుకు పంపారు. ఏపీ ఆర్థికమంత్రి పేరుతో ఈమెయిల్ రావడంతో కళా వెంకటరావు అనుమానించారు. దీంతో కళా ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి పేషీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ లేఖలో ఉన్న వివరాల ఆధారంగా కారు డ్రైవర్ అఖిల్‌ను యనమల పేషీకి పిలిపించారు. మంత్రి పేరుతో ఈమెయిల్ ఐడి సృష్టించి లేఖ రాసినట్లు తెలియడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే కేసు లేకుండా ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. పోలీసులు తమకు ఫిర్యా దు అందలేదని చెబుతున్నారు.