ఆంధ్రప్రదేశ్‌

పావలాకు కొరగాని పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రాష్ట్రంలో కవాతులు, ర్యాలీల పేరుతో హింసను ప్రేరేపించేలా మాట్లాడుతూ అలజడులు సృష్టించి, అశాంతి నెలకొల్పడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉద్దానం బాధితులను ఉద్ధరిస్తానని గతంలో చెప్పిన పవన్ నేడు ఉత్తరాంధ్రకు వచ్చిన కష్టాన్ని పట్టించుకోకుండా ఉపన్యాసాలకే పరిమితమయ్యారన్నారు. తుపాను బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని, అధికార యంత్రాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం పవన్ రాజకీయ అపరిపకత్వతకు నిదర్శనమని సాదినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ శాఖకూ రానన్ని అవార్డులు పంచాయతీ రాజ్ శాఖకు వచ్చాయని, ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి లోకేష్‌పై పావలాకు కొరగాని పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తోందన్నారు. వారసత్వం గురించి మాట్లాడే పవన్ గతంలో తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారని, తన కుటుంబం నుంచి 8 మందిని హీరోలుగా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చారని ఆమె గుర్తు చేశారు. గతంలో అప్పులు పాలయ్యానని, ఇల్లు అమ్ముకోవాలని చెప్పిన పవన్ కవాతు పేరుతో రూ.38కోట్లు ఎలా ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పగలరా అని యామని ప్రశ్నించారు. జనంలోకి వెళ్లడానికి భద్రతా కారణాలను సాకుగా చూపడం పవన్‌కు ఫ్యాషన్‌గా మారిందని ఆమె దెప్పి పొడిచారు.