ఆంధ్రప్రదేశ్‌

పాతపెన్షన్ విధానంపై సచివాలయంలో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై సచివాలయంలో మంగళవారం చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఎస్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీ రామాంజనేయులు యాదవ్, పఠాన్ బాజీలతో కూడిన ఓ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ముద్దాడ రవిచంద్రలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ నూతన విధానం వల్ల అంటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు ఎంతో నష్టం చేకూరుతున్నదన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందన్నారు. నూతన విధానాన్ని రద్దు చేస్తే ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కల్గుతుందన్నారు. అదే విధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, అంగన్‌వాడీ, హోంగార్డు ఉద్యోగులకు జీతభత్యాలు పెంచడం పట్ల ముఖ్యమంత్రికి వీరందరూ ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో ఉంటారన్నారు. అయితే వీరి ఆదాయం పెరుగుతున్నందున తెల్లరేషన్ కార్డులు రద్దు చేసేందుకు స్థానిక అధికారులు సిద్ధమవుతున్నందున మానవతా దృక్పథంతో వారి తెల్లకార్డులను కొనసాగింప చేయాలని బొప్పరాజు కోరారు. దీనిపై అనిల్ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందించారు.