ఆంధ్రప్రదేశ్‌

వారసత్వంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: వారసత్వంపై మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కించపరుస్తూ మాట్లాడం సరికాదన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని పల్లెత్తు మాట అనకుండా, రాష్ట్భ్రావృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్‌ను పవన్ కల్యాణ్ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ రంగాల ప్రవేశం ఆయన అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లోనే సాగిందన్నారు. అటు సినిమా, ఇటు రాజకీయం... రెండింటిలోనూ వారసత్వం మాటునే పవన్ కల్యాణ్ రంగ ప్రవేశం చేశారన్నారు. అటువంటి పవన్‌కు వారసత్వాలపై మాట్లాడే అర్హతలేదని స్పష్టం చేశారు. జగన్ గురించి తనకు తెలియదని పవన్ అనడం విచిత్రంగా ఉందన్నారు. 2014 ఎన్నికల్లో ఒక అజెండా, 2019 ఎన్నికల్లో మరో అజెండా పట్టుకుని మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ గురి తప్పిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు నిలదీయటం లేదని పవన్‌ను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశాలను జనసేన కవాతులో పవన్ ప్రస్తావించలేదన్నారు.