ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి ప్రాజెక్టుల సత్వరపూర్తికి చంద్రబాబు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక జలవనరులశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 61 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి పురోగతిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 59.32 శాతం పనులు పూర్తికాగా, హెడ్‌వర్క్ పనులు 46.39 శాతం, ప్రధాన డ్యామ్ 45.80 శాతం, తవ్వకాల పనులు 79 శాతం, కాంక్రీటు పనులు 45.5 శాతం, రేడియల్ గేట్ల పనులు 65.85 శాతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 100 శాతం జరిగాయన్నారు. జెట్‌గ్రౌటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. పోలవరం కుడి కాలువ పనులు 96 శాతం, ఎడవ కాలువ పనులు 64.28 శాతం అయ్యాయన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా విశాఖపట్నానికి మంచినీరు అందిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీకి 350 కిలోల 6,559 పత్రాలు పంపించామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు రూ. 57,940 కోట్లు డీపీఆర్ 2 కింద అంచనాలు పంపామని, ఇందులో రూ. 33,225 కోట్లు ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద చెల్లించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగకుండా ఉండేందుకు రూ. 3,0 39 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. డ్యామ్ సైట్‌లో ఉన్న నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుని వారికి సాయం అందిస్తామన్నా రు. 61 ఇరిగేషన్ ప్రాజెక్టులలో 15 ప్రాజెక్టులు ప్రారంభించామ ని, నాలుగు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 26 ప్రాజెక్టులు రాబోయే కొద్ది కాలంలో పూర్తి చేస్తామని అన్నారు. 16 కొత్త ప్రాజెక్టులకు త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. గోదావరి నది నుంచి 2,420 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లగా, 121 టీఎంసీలు రైతులకు ఉపయోగించామన్నారు. కృష్ణానది నుంచి 38 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని, ఈ నీటిని నిల్వ చేయడానికి వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తున్నామన్నారు.