ఆంధ్రప్రదేశ్‌

పవన్‌కు ఒక్క సీటు కూడా రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు ఒక్క సీటు కూడా రాదని వక్ఫ్‌బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ అన్నారు. మంగళవారం నగరంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జలీల్‌ఖాన్ మాట్లాడుతూ సినిమాల అనుభవంతో తన అన్న ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీకి 16 సీట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు ఒక్క సీటు కూడా రాదని, తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ ప్రభావం, జగన్ జైల్లో ఉండటంతో 60 సీట్లు వచ్చాయి గాని ఈసారి జగన్‌కు 30 సీట్లు లోపే వస్తాయన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అపార అనుభవంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. పవన్ అవాకులు, చవాకులు పేలడం మంచిది కాదన్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చనిపోతే వారి భార్యలను పరామర్శించకుండా ఎగతాళిగా మాట్లాడటం గిరిజనుల పట్ల ఆయన వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఎక్కడ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లుతున్నారన్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాను భారినపడిన ప్రజలకు రాత్రింబవళ్లు పనిచేస్తూంటే విమర్శించడం పవన్ కళ్యాణ్‌కి తగ్గదన్నారు. చిరంజీవి కుటుంబం మొత్తాన్ని సినిమాల్లోకి తీసుకువస్తే తప్పుకాదు గానీ, ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేయడం తప్పా అని అన్నారు. రాష్ట్రంలో జనం మీ ఒక్కరికే లేరని, టీడీపీకి కూడా ఉన్నారన్నారు. మా నాయకుడు ఆదేశిస్తే మా బలం చూపించి మా సత్తాను నిరుపిస్తామన్నారు. మీ అన్న చిరంజీవి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారన్నారు.