ఆంధ్రప్రదేశ్‌

రూ.99 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 16: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారికి మంగళవారం రూ.99 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకారం చేశారు. మహాలక్ష్మీదేవి రూపం కావడంతో ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకారం చేపట్టారు. కరెన్సీ నోట్లతో పాటు వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారికి అలంకరణ చేశారు. శ్రీ మహాలక్ష్మీ అలంకరణలో వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పులకించారు. తొలి పూజల్లో కలగర వీర్రాజు, సత్యవరపు రాజేష్‌గుప్త దంపతులు పాల్గొన్నారు. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి చిట్లూరి అచ్యుతలక్ష్మీ సుబ్బారావు (దామోదరరావు) అర కిలో వెండితో కవచం చేయించి బహూకరించారు. 17వ తేదీ ఉదయం శ్రీ దుర్గాదేవిగా, సాయంత్రం శ్రీ మహాకాళీదేవిగాను భక్తులకు శ్రీ గంగానమ్మ అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ కమిటీ ఛైర్మన్ రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఇదే పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రూ.36 లక్షల కరెన్సీతో అలంకరించారు.

చిత్రం..కరెన్సీ నోట్లతో అలంకృతమైన శ్రీగంగానమ్మ అమ్మవారు