ఆంధ్రప్రదేశ్‌

జల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి వరద ఉద్ధృతి ఉభయ గోదావరి జిల్లాలపై ఇంకా తీవ్ర ప్రభావం చూపుతూనేవుంది. ఎగువన భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, అక్కడి నుండి వరద నీరు దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను బుధవారం కూడా కొనసాగించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం వరకు పెరుగుతూనే ఉన్నప్పటికీ, సాయంత్రం నుండి మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినా వరద జలాలను కాటన్ బ్యారేజీ నుండి దిగువకు వదిలేస్తుండటంతో కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. అయితే ఎగువ భాగంలో వరద తగ్గుముఖం పట్టినందున ఇంతకు మించి ప్రమాదం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద బుధవారం మధ్యాహ్నం 14.8 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 14.65 అడుగులకు తగ్గింది. అలాగే మధ్యాహ్నం వరకు 14.8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలచేయగా, సాయంత్రానికి 14.48 లక్షలకు తగ్గింది. బ్యారేజి ఎగువన రాజమహేంద్రవరం సమీపంలోని ఏటిగట్టు బలహీనంగా ఉండటంతో కోతకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం సర్వే బాదులు, ఇసుక బస్తాలువేసి పటిష్ఠపర్చడంతో గండి పడే ప్రమాదం తప్పింది.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కోనసీమలోని లంక భూములు నీట మునిగాయి. ముఖ్యంగా కూరగాయల పంటలు పాడైపోయాయి. మరో రెండు రోజులు ముంపు కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇటుకల బట్టీలు సైతం నీట మునగడంతో నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లచుట్టూ నీరు చేరింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ రేవువద్ద కాజ్‌వే నీట మునిగింది. రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక జలదిగ్బంధంలో చిక్కుకుంది.
కాగా గోదావరి తగ్గుముఖం పట్టడంతో విలీన మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా ఇంకా రోడ్లపైకి చేరిన వరద నీరు అలాగే ఉండటంతో రాకపోకలకు అంతరాయం తప్పడంలేదు. విఆర్‌పురం మండలం శ్రీరామగిరి, చొక్కనపల్లి, కల్తునూరు, పోచవరం, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం తదితర గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కూనవరం మండలంలో భద్రాచలం-కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు ఉండటంతో బస్సులు నిలిచిపోయాయి. కోండ్రాజుపేట కాజ్‌వేపై వరద నీరు ఉండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎటపాక మండలం నెల్లిపాక వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది.
chitram..

1. రాజమహేంద్రవరం పాత బ్రిడ్జివద్ద గోదావరి ఉద్ధృతి

2. రావులపాలెం మండలం తోకలంకలో
పడవలపై ప్రజల ప్రయాణం