ఆంధ్రప్రదేశ్‌

ఆ ముగ్గురూ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, అక్టోబర్ 21 : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర అభివృద్ధికి గ్రహణంలా అడ్డుతగులుతున్నారని రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి గ్రామంలో ఆదివారం చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ‘టీడీపీ ఆత్మీయ సభ’ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, జవహర్, ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి కాలవ మాట్లాడుతూ ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం వున్న వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అన్నారు. మోదీ ఆ భయంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చంద్రబాబు, రాష్ట్రంపై కక్ష కట్టారన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్‌కు వున్న అహంకారాన్ని భరించ లేకనే టీడీపీలో చేరానన్నారు. కడప జిల్లాలో వైసీపీని కనుమరుగు చేస్తామన్నారు. జగన్‌కు డబ్బు వ్యామోహంతో పాటు పదవి పిచ్చి కూడా పట్టిందన్నారు. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్ కేసులకు భయపడి మోదీతో రహస్యంగా కుమ్మక్కయ్యారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబును విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల నాయకులకు లేదన్నారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ఒకటి కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసి జీవీఎల్ నరసింహారావు ఓ జోకర్‌గా మారాడన్నారు. సభలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు పార్థసారధి, గోనుగుంట్ల సూర్యనారాయణ, అత్తార్ చాంద్‌బాషా, హనుమంతరాయచౌదరి, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గౌస్‌మొయిద్దీన్ పాల్గొన్నారు.