ఆంధ్రప్రదేశ్‌

దావోస్‌లో సదస్సు.. మంత్రి లోకేష్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్‌లో నిర్వహించనున్న సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 25 వరకూ జరిగే ఫోరం వార్షిక సమావేశాలు, 4వ పారిశ్రామిక విప్లవంలో భాగమైన గ్లోబలైజేషన్ 4.0పై చర్చల్లో పాల్గొనాల్సిందిగా కోరింది. గ్లోబలైజేషన్ 4.0కు ఒక రూపం తీసుకువచ్చేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ అజెండా రూపొందించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ఐటీని వినియోగిస్తూ, ఏపీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి సాధిస్తోందని, వినూత్న ఆవిష్కరణలను, వ్యాపార వేత్తను ప్రోత్సహిస్తూ, పాలనలో పారదర్శకతకు అనుసరిస్తున్న వ్యూహాలను ఇతర ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు వీలుగా ఈ ఆహ్వానం పంపుతున్నట్లు ఆ లేఖలో తెలిపారు.