ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మెట్రోపై సీఎస్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా సమీక్ష చేశారు. వెలగపూడి సచివాలయంలో అమరావతి మెట్రోరైల్ ప్రాజెక్టు అధికారులతో సోమవారం సమీక్ష ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ మీడియం మెట్రో రైలు ప్రాజెక్టులు, లైట్ మెట్రోరైలు ప్రాజెక్టులు ఉన్నాయో అన్న దానిపై ఆరా తీశారు. వాటి వివరాలు సేకరించాలని సూచించారు. విజయవాడ మెట్రో పనితీరుపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎ.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును 8300 కోట్ల రూపాయల అంచనాలతో 3 కారిడార్ల కింద 42.5 కిలోమీటర్ల మేర లైట్ మెట్రోగా నిర్మించనున్నట్లు తెలిపారు. పీపీపీ తరహాలో చేపట్టనున్న ప్రాజెక్టు దేశంలోనే రెండో అతి పెద్ద ప్రాజెక్టు అని వివరించారు. 5 ఏజన్సీలను షార్టు లిస్టు చేశామని తెలిపారు.