ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దు చేసే వరకూ ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్నాయని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసే వరకు ఐక్య ఉద్యమాలు ఉద్ధృతంగా కొనసాగిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ పి అశోక్‌బాబు స్పష్టంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపుమేరకు మంగళవారం ఉద్యోగులు ఛలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి బిఆర్ స్టేడియం వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ దేశంలో 2004 నుండి సీపీఎస్ విధానాన్ని పాలకులు అమలులోకి తెచ్చారని, దీంతో ఉద్యోగులు పెన్షన్ సదుపాయాన్ని కోల్పోయారన్నారు. ఉద్యోగులకు నష్టం కల్గించే ఈ పథకాన్ని ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు చెప్పడం వాస్తవ దూరమన్నారు. మన రాష్ట్రం 2017-18లో 700 కోట్లు, 2018-19లో దాదాపు వెయ్యి కోట్లు సీపీఎస్ విధానం కోసం చెల్లించిదన్నారు. ఉద్యోగుల నుండి వెయ్యి కోట్లు, ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటుగా మరో వెయ్యి కోట్లు మొత్తంగా రెండు వేల కోట్లు ప్రైవేటు పెన్షన్ ఫండ్‌ల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. ఉద్యోగులు భవిష్యనిధిలో ఏడాది జమచేసే వెయ్యి కోట్లు కూడా ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా పోతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పెన్షన్ నిధిలోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో సీపీఎస్ విధానం రద్దుచేయాలని, ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టాయని చెప్పారు. అవుట్ సోర్సింగు విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

చిత్రం..సభలో సంఘీభావం చాటుతున్న జేఏసీ నేతలు