ఆంధ్రప్రదేశ్‌

మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 11.25 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 11.25 శాతం మేర వృద్ధి రేటు నమోదు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో కొత్తగా సాగులోకి వచ్చిన భూముల వివరాలు తెలియచేయాలని కోరారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక వృద్ధి సలహాదారు, అర్థ గణాంక శాఖ అధికారులతో 2018-19 సంవత్సర మొదటి త్రైమాసిక వృద్ధి రేటు, రెండో త్రైమాసిక ప్రగతిపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వృద్ధి రేటు 14.66 శాతం, పరిశ్రమల రంగం 11.00 శాతం, సేవా రంగంలో 10.10 శాతం మేర వృద్ధి రేటు నమోదైందన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కొత్తగా సాగులోకి వచ్చిన భూములు, ఉత్పత్తుల వివరాలను తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూమిని ఉద్యాన పంటల భూములుగా మార్చిన, చేపల చెరువులుగా మార్చిన భూముల వివరాలు తెలియచేయాలన్నారు. జనాభా వృద్ధి రేటు, ఆహార ఉత్పత్తి వృద్ధి రేటు, వరి, గోధుమ వృద్ధి, ద్రవ్యోల్బణంపై కూడా మంత్రి సమీక్షించారు. పాడిపరిశ్రమలో ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా 11.7 శాతం ఉత్పత్తి లభిస్తున్నదన్నారు. చేపల ఉత్పత్తుల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు 60 శాతం మేర ఆదాయం లభిస్తోందన్నారు. తయారీ రంగంలో విశాఖ జిల్లా నుంచి 30 శాతం, గుంటూరు జిల్లా నుండి 11.89 శాతంతో ముందంజలో ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం పరిశ్రమలకు 3 వేల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. సేవా రంగంలో పర్యాటక, ఐటి, రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాల్లో ఎక్కువ వృద్ధి రేటు సాధించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. సేవా రంగంలో అత్యధిక వృద్ధి రేటు సాధించేందుకు అవకాశం ఉన్న అన్ని శాఖలపై సమగ్ర నివేదిక తయారుచేసి, ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 15 శాతం వృద్ధి రేటుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక వృద్ధి సలహాదారు దక్షిణామూర్తి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు