ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ‘ఆనందాల గూడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 5: అమరావతిలో ప్రజల కోసం తొలి నిర్మాణ ప్రాజెక్ట్ ‘హ్యాపీనెస్ట్’ను ప్రారంభించటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తక్కువ ధరలో అధునాతన ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ప్రణాళిక రూపొందించాలని రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ) అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు ఆనందాల గూడును అందుబాటులోకి తేవాలన్నారు. రాజధాని నగరంలో అన్నివర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ ఇళ్లను కేటాయించేందుకు ఐదంచెల విధానాన్ని అనుసరించాలని సూచించారు. గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నాణ్యత, అందుబాటు ధరలు, విశ్వసనీయత, ప్రజా సంతృప్తి, పారదర్శకత, ముందువచ్చిన వారికి ముందు అనే ఐదు సూత్రాలను అమలుచేయాలని నిర్దేశించారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని, తొలి హౌసింగ్ ప్రాజెక్ట్ కావటంతో ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలిపారు. ఇది సీఆర్డీఏ బాధ్యతను మరింత పెంచిందన్నారు. నమ్మకమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద ఆస్తి అని స్పష్టం చేశారు. ముంబై స్టాక్ ఎక్సేంజిలో అమరావతి బాండ్ లిస్టింగ్ చేసిన గంటల వ్యవధిలోనే 2వేల కోట్ల ఆఫర్లు వచ్చాయని గుర్తుచేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమన్నారు. హ్యాపీనెస్ట్ కూడా అంతేస్థాయిలో విజయవంతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ రాజధాని నిర్మాణంలో మరో మైలురాయి అవుతుందన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌తో ప్రజల అవసరాలకు అనుగుణంగా హరిత జీవనశైలి సౌకర్యాలు సమకూర్చాలన్నారు. ప్రజల అంచనాలను చేరుకునేందుకు సీఆర్డీఏ అధికారులు మరింత శ్రమించాలని, అమరావతి ప్రతిష్టను ఇనుమడింప చేయాలని సూచించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కు అనూహ్య స్పందన వస్తోందని ఇంధన, వౌలిక వనరులు, సీఆర్డీఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. 9న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నామని, కొద్ది గంటల్లోనే 600 ప్లాట్లు అమ్ముడుపోవటం ఖాయమన్నారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో ప్రతి అపార్ట్‌మెంట్‌ను ప్రజలు కోరుకునే విధంగా అత్యాధునిక, జీవన ప్రమాణాలతో కూడిన ఆరోగ్యకరమైన, సంతోషదాయకంగా జీవించేలా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు.
ఫ్లాట్లను 1290-2750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని చెప్పారు. అధునాతన టెక్నాలజీతో నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. భారతీయ హరిత భవన్ కౌన్సిల్ (బీహెచ్‌బీసీ) నిబంధనల మేరకు గోల్డ్ రేటింగ్ లక్ష్యంగా ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. 24గంటలు నీరు, విద్యుత్ సరఫరా, వర్షపునీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు. 50వేల చదరపు అడుగులలో క్లబ్ హౌస్, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. ఆపార్టుమెంట్లు వాస్తు, భద్రతా ప్రమాణాలు ఉంటాయన్నారు. నిర్మాణం, నాణ్యత విషయంలో సీఎం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామన్నారు. 12 టవర్లలో 1200 స్మార్ట్ 2, 3 బెడ్‌రూం ఫ్లాట్లు రెండు దశల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. అమరావతి నగర నడిబొడ్డున 14.46 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. సచివాలయానికి 3.5 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు హ్యాపీనెస్ట్ లైవ్, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. సీఆర్డీఏ. ఏపీ జీవోవీ. ఇన్/ హ్యాపీనెస్ట్ వెబ్‌సైట్లలో ప్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, ఏడీసీ చైర్మన్ లక్ష్మీపార్థసారధి, సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్ పాల్గొన్నారు.