ఆంధ్రప్రదేశ్‌

నిర్దేశిత లక్ష్యాలతో కేంద్ర పథకాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 5: రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హోం, వైద్య, ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 23న ఢిల్లీలోని ప్రగతి భవన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర హోం, వైద్య, ఆరోగ్య శాఖ, ట్రాన్స్‌కోలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని తెలిపారు. ఈ మూడు శాఖల్లో అమలవుతున్న కేంద్ర పథకాల పురోగతిని ప్రధానికి వివరించనున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ సబ్‌స్టేషన్ల ఆధునీకరణ, నిర్మాణాల గురించి సీఎస్ ఆరా తీశారు. వైద్య, ఆరోగ్య శాఖలో అమలవుతున్న ఆయుష్మాన్‌భవ పథకం అమలు తీరుపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను, హోం శాఖలో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆ శాఖ కార్యదర్శి అనూరాధను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్దేశించిన లక్ష్యాలలోగా పూర్తిచేయాలని పునరుద్ఘాటించారు.
మూడు శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిపై అంశాల వారీగా నివేదిక తయారుచేసి ఈ నెల 20నాటికి అందించాలని ఆదేశించారు. 23న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి ఆ వివరాలు తెలియజేస్తామన్నారు. సమావేశంలో జీపీఎం, ఏఆర్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, హోం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ పునేఠా