ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధి రుణంలో 7.10 శాతం డిసెంబర్‌లో చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్భ్రావృద్ధి రుణం- 2018లో మిగిలిన 7.1 శాతాన్ని ఈ ఏడాది డిసెంబర్ 12న చెల్లించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 11వ తేదీ వరకూ వడ్డీ సహా చెల్లిస్తారని తెలిపారు. డిసెంబర్ 12 నుంచి ఈ రుణంపై ఎలాంటి వడ్డీ చెల్లించరని తెలిపారు. స్టాక్ సర్ట్ఫికెట్ రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన రిజిస్టర్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ విధానం ద్వారా జమ చేస్తారు.
ప్రభుత్వ సెక్యూరిటీల ఒరిజినల్ సబ్‌స్క్రైబర్, ఆ తరువాతి హోల్డర్ వడ్డీ చెల్లింపులకు ఖాతాల వివరాలను స్టేట్ బ్యాంక్ శాఖకు, ట్రెజరీకి తెలియచేయాలని ఆయన సూచించారు.