ఆంధ్రప్రదేశ్‌

విపత్తు బాధితులకు సకాలంలో సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ‘తిత్లీ తుపాను బాధితులకు సహాయం అందించటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సొంత వనరులతోనే బాధితులకు సాయం అందించాలనుకున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం దీపావళికి ముందే బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విపత్తు బాధితులకు సకాలంలో సాయం అందించగలిగామని ఉద్ఘాటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయ రంగ పురోగతిపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ. 530కోట్ల సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను సంభవించిన 15రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి తెచ్చి 25రోజుల్లోనే పరిహారం అందించామన్నారు. వేలాది మంది సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు చెమటోడ్చి పనిచేశారని, బాధిత ప్రజానీకానికి అండగా నిలిచారని ప్రశంసించారు. బాధ్యతాయుతమైన పాలనకు చిరునామా మన రాష్టమ్రన్నారు. ఆర్టీజీ, 1100 పరిష్కార వేదిక ఒక నమూనా అయ్యాయన్నారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు. ఇది నెంబర్ వన్‌కు చేరుకోవాలని ఆకాంక్షించారు. మన జల సంరక్షణ, కన్వర్జెన్స్, ఊబరైజేషన్‌తో వినూత్న ఫలితాలు సాధించామని చెప్పారు. లోటు వర్షపాతంలో కూడా నెల్లూరు జిల్లాకు 40 టీఎంసీల నీటిని అందించగలిగామన్నారు. వర్షాలు కురవకపోయినా రైతులకు భరోసా కల్పించామన్నారు. బాపట్ల వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు విత్తనాల పాకెట్ల సరఫరాలో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పాకెట్లు తారుమారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. రబీలో నూరు శాతం కంటే అధికంగా సాగు చేసిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రబీలో నాట్లు త్వరితగతిన వేసేలా రైతుల్ని చైతన్యపరచాలని సూచించారు. ఎగువ నుంచి వరద ప్రవాహాలు లేవని, వర్షపాతంలో తీవ్ర లోటు ఉన్నందున ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాలని నిర్దేశించారు. వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అధిక ఉత్పాదన వచ్చే మేలైన పద్ధతులను అమలు చేయాలన్నారు. కరవు బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని, ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని ఆదేశించారు. యూనిట్ల మంజూరు శరవేగంతో పూర్తి చేయాలన్నారు. రెండు నెలల్లో 8లక్షల యూనిట్లు పంపిణీ చేయాలని, ఒక్క పైసా అవినీతి జరిగినా సహించేదిలేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అంటువ్యాధుల పట్ల అప్రమత్తం
రాష్ట్రంలో ప్రబలుతున్న అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూపై అనుక్షణం పరిశీలన జరపాలన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలన్నారు. మెటీరియల్ కాంపొనెంట్ నిధులు పెంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్దేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.