ఆంధ్రప్రదేశ్‌

రక్షణ కల్పించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: జ్ఞాపికల కొనుగోళ్లలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్ఞాపికల కొనుగోలు వ్యవహారంలో ఏఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడును సస్పెండ్ చేయడంతో ఆయన ఈవో కోటేశ్వరమ్మ చాంబర్‌కు వచ్చి పరుష పదజాలంతో, తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేశాడని పేర్కొన్నారు. తనపై చర్య తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఈవో తెలిపారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రదర్శన ఇచ్చిన కళాకారులను జ్ఞాపికలతో సత్కరిస్తుంటారు. అయితే కళా బృందాల్లోని ప్రతి సభ్యునికి జ్ఞాపిక ఇవ్వాల్సి ఉండగా, బృందం అంతటికీ కలిపి ఒకే జ్ఞాపిక అందజేశారు. లంకా ఆదిలక్ష్మి అనే బ్యాంక్ ఉద్యోగిని కళాకారులకు జ్ఞాపికలు ఇవ్వడంలో అక్కడున్న సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు, సిబ్బంది, కళాకారులకు మధ్య అక్కడ జరిగిన సంభాషణ వివరాలను తెలియచేస్తూ ఈవోకు లేఖ రాశారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆమె ఆదేశించారు. కళాకారులకు జ్ఞాపికలు ఇవ్వడంలో అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడి కావడంతో బాధ్యులైన నలుగురిపై ఈవో చర్యలు తీసుకున్నారు. ఒక్కో జ్ఞాపికకు 95 రూపాయలను అనూష హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థకు దేవస్థానం చెల్లిస్తోంది.
ముందుగా 2వేల జ్ఞాపికల సరఫరాకు వర్కు ఆర్డరు ఇచ్చి, తరువాత మరో 500 సరఫరా చేయాలని దేవస్థానం అధికారులు కోరారు. అయితే విచారణలో కేవలం 1200 జ్ఞాపికలను మాత్రమే సరఫరా చేసినట్లు సదరు కాంట్రాక్టు సంస్థ వారు అంగీకరించడంతో, అక్రమార్కులపై ఈవో సస్పెన్షన్ కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఏఈవో అచ్యుతరామయ్య నాయుడు, సూపరింటెండెంట్ వై గోపీచంద్, సీనియర్ అసిస్టెంట్ (కనకదుర్గ ప్రభ మేగజైన్), సాంస్కృతిక కార్యక్రమాల ఇన్‌చార్జి పి సునీత, కాంట్రాక్ట్ వర్కర్ ఎస్‌కే సైదా ఉన్నారు. 2వేల జ్ఞాపికలను సరఫరా చేశారని, 1.90 లక్షల రూపాయల బిల్లు చెల్లించాలని ఏఈవో అచ్యుతరామయ్య సిఫారుసు చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు నెలరోజుల సమయం ఇచ్చారు.

చిత్రం..దుర్గగుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈవో కోటేశ్వరమ్మ