ఆంధ్రప్రదేశ్‌

పక్క జిల్లాలో ఉన్నా పరామర్శకు రాని జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 5: ప్రధాని మోదీకి విపక్షనేత జగన్ దొంగపుత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ తిత్లీ బాధితులను పరామర్శించేందుకు కనీసం జగన్ రాలేదన్నారు. కవాతులు చేసేందుకు, ఫాంహౌస్‌కు వెళ్లేందుకు వీరికి సమయం ఉంటుందని, బాధల్లో ఉన్నవారిని మాత్రం పరామర్శించరని లోకేష్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే తిత్లీ బాధితులకు సహాయం అందించాలే గాని రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలుకు పాల్పడడం సరికాదన్నారు. బీజేపీ నాయకులకు సవాళ్లు విసుర్తున్న మీ అధినాయకత్వంపై బాధితులను ఆదుకోవాలని పోరాడండి అని అన్నారు. ప్రకృతి కనె్నర్రజేస్తే బాధితులకు అండగా నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన స్పష్టం చేశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఓటేసి చంద్రబాబు రుణం తీర్చుకోవల్సిన బాధ్యత మీపై ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని మందసకు వచ్చిన మంత్రి లోకేష్ మండల కేంద్రంలో వ్యాయామశాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తిత్లీ బాధితులకు నష్టపరిహారం చెక్కులను మంత్రి లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వయసులో ఇటువంటి తుఫాన్‌లు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా, మరెన్ని ఇబ్బందులు ఎదరయినా సమర్ధవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు మనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో బాధితులకు సుమారు 34 లక్షల మందికి భోజనం అందించామన్నారు. టీడీపీ ప్రభుత్వం బాధితులకు అన్ని వేళలా అండగా వుందన్నారు. రాబోయే మూడేళ్లపాటు తుఫాన్ బాధిత గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం అందిస్తామన్నారు. మత్సకారులకు పూర్తి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. విపత్తు సంభవించి నెలరోజులోపే రూ.520 కోట్లు నష్టపరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీయేనని పేర్కొన్నారు. ఎన్నో స్వచ్ఛంధ సంస్థలకు, బాధితులకు సహాయం అందించాయని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
అర్హుడైన ప్రతీ బాధితుడికి శతశాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, సుమారుగా 10వేల మంది కార్మికులు, అధికారులు పునరుద్ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారని, వారి సమిష్టి కృషి అభినందనీయమన్నారు. మందస మండలాన్ని దత్తత తీసుకొని ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తుఫాన్‌తో గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని, తిరిగి వాటిని ఉత్తమ గ్రామాలుగా నిలబెట్టే బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను తీసుకుంటానని అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..తిత్లీ బాధితులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి నారా లోకేష్