ఆంధ్రప్రదేశ్‌

రెల్లి కులం స్వీకరిస్తున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 5: ఈ రోజు నుంచి తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాని, తను ఇక రెల్లి కులస్థుడిని’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికే తాను వచ్చానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జీ కనె్వన్షన్ కళ్యాణ మండపంలో సోమవారం రెల్లి కులస్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని తాను రెల్లికులానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రెల్లి కులస్థులు సామాజికంగా ఎదుర్కొనే సమస్యలపై స్థానిక రెల్లి కులస్థురాలు తలుపులమ్మ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం ఆయనను తీవ్రంగా కదిలించింది.
సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానవ మలమూత్రాలను చేతితో తీసే రెల్లి కులస్థుల జీవన విధానం తనపై చిన్నప్పటి నుంచి తీవ్రంగా ముద్ర వేసిందన్నారు. ఈ రోజుకీ అదే పరిస్థితి మారుమూల ప్రాంతాల్లో కొనసాగడం బాధాకరమన్నారు. భారతదేశం త్రికోణంలో వుంటే అందులో ఒక కోణం సరిహద్దులో కాపలా కాసే సైనికులైతే, మరో కోణం రైతులు, ఇంకో కోణం రెల్లి కుల పారిశుద్ధ్య కార్మికులని విశే్లషించారు.
చెత్తను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను సరిగా చూసుకోకపోతే ద్రోహం చేసినవారమవుతామన్నారు. రెల్లి కులస్థులు ఎదుర్కొనే వివక్ష ఎలా వుంటుందో తనకు తెలుసని, రెల్లి కులస్థులంటే ఇల్లు అద్దెకు ఇవ్వని పరిస్థితి వుందన్నారు. ఇకపై ఎవరైనా ఇల్లు అద్దెకు ఇవ్వబోమని చెబిత పవన్ కళ్యాణ్ మా కులమేనని చెప్పాలని సూచించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలు మానవ సేవల్లో అద్వితీయమన్నారు.
మదర్ థెరిస్సా మాదిరిగా మానవ సేవలో నిమగ్నమై వున్న మీకు అండగా నిలబడకపోతే జనసేనకు ద్రోహం చేసినట్టేనన్నారు. తాను అందరిలా ఎక్కువ హామీలు ఇవ్వదల్చుకోలేదని, ఎక్కువ మాట్లాడనని, చేస్తాను చేస్తాను అని చెప్పడం కంటే చేయడం తేలిక అన్నారు. భగవంతుడు ఎక్కడున్నాడో, ఏ రూపంలో వుంటాడో తనకు తెలియదు కానీ భగవంతుడు ముగ్గురి రూపంలో ఉంటాడని ఒక రెల్లి చెల్లి చెప్పిందన్నారు. సైనికుడు, అన్నంపెట్టే రైతు, చెత్తను శుభ్రం చేసే రెల్లి కులస్తుల్లో దేవుడు ఉంటాడన్నారు. రెల్లి కులస్థులకు అండగా ఉంటానని ప్రకటించారు.
ఉదాత్తమైన సేవ అందిస్తున్న రెల్లి కులమే ఉన్నత కులమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి, అలా రూ.18000 ఇవ్వాలని, వెంటనే ఈ విధంగా వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య, విద్యాబుద్ధులు కలిగించే జీవనం ఇస్తానన్నారు.
మానవ చెత్తను శుభ్రపరిచే రెల్లి కులస్థులకు ఫించన్లు అందకపోవడం బాధాకరమని, ఫించన్లు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఎంతసేపూ దోచుకోవడం తప్ప చెత్తను ఊడ్చి శ్రమటోడ్చుతున్న రెల్లి కులస్థులకు సీఎం, లోకేష్ కనీసం ఇళ్లు కూడా ఇవ్వలేరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న జనసేన అధినత పవన్‌కళ్యాణ్