ఆంధ్రప్రదేశ్‌

పశు సంపదతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 6: ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. ప్రభుత్వంలో నూతన విధానాన్ని అమలు చేయనున్నాం.. పశు సంపత్తితోనే అభివృద్ధి జరుగుతుంది.. పాడిపరిశ్రమకు రాష్ట్రం చిరునామా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి ఉండవల్లి ప్రజావేదికలో గోపాలమిత్ర సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం నుంచి ఉద్యానవన సాగును పెంచే దిశగా ప్రణాళిక రూపొందించామన్నారు. పశువులకు సమతుల ఆహారం అందించాలన్నారు. అవులు, గేదెలకు తగిన పోషణతో దిగుబడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పాల ఉత్పత్తికి ఆంధ్ర ప్రాంతం వేదిక కావాలన్నారు. అది గోపాలమిత్ర ద్వారా సాధ్యపడిందని గర్వంగా చెప్పుకునే రోజు రావాలన్నారు. 2015-16లో 10.5 శాతం, 2016-17లో 11.22, 2017-18లో 11.57, ఈ ఏడాది 20శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మొదటి ఆరు నెలల్లోనే 16.28 శాతం సాధించామన్నారు. రానున్న రోజుల్లో 20 శాతానికి తగ్గకుండా లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది పశు వైద్య సహాయకులను నియమించామని హార్టీకల్చర్ ఎంపీడీఏ కింద 450 మంది పనిచేస్తున్నారని వివరించారు. గోకులంలో భాగంగా పెద్దఎత్తున సామూహికంగా షెడ్లు నిర్మిస్తున్నామని ఇంటి దగ్గర ఇబ్బందులు ఎదురైతే పసుశ్రీలను పొలాల దగ్గర కానీ, గ్రామాల శివార్లలో కానీ ఉండే విధంగా షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. వ్యక్తిగతంగా కాకుండా ఒక్కొక్కరికీ 2 పశువులు ఉంటే 10 మంది కలిపి 20 పశువులను పెంచుకునే విధంగా సామూహిక గోకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గోపాలమిత్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుని వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు.

చిత్రం..గోపాలమిత్రలతో ముఖాముఖిలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు