ఆంధ్రప్రదేశ్‌

వేదవతి ప్రాజెక్టును నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: కరవు ప్రాంత కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బాగా వెనుబడిన కరవు ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న ‘వేదవతి’ నది నీటిని ఎత్తిపోయటం ద్వారా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 50వేల ఎకరాలకు నీరందించడానికి వీలవుతుందన్నారు. అలాగే తాగునీటికి కటకటలాడుతున్న పలు గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చడానికి అవకాశముంటుందని, ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధ వహించి కరవు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని కోరారు.