ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు కన్నా మరో 8 ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారం వారం ఐదేసి ప్రశ్నలు సంధిస్తూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం మరో ఎనిమిది ప్రశ్నలను సంధించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఎంత.. వాటి కోసం ప్రభుత్వం ఇచ్చింది... ఇచ్చేది ఎంతో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమేనాఅని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్‌లో భూ కేటాయింపులు, ఆపై ఆయా భూముల్లో ఏ సంస్థ కూడా పరిశ్రమ స్థాపించకపోవడం, దీనిపై హైకోర్టు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతి, కిస్మస్, రంజాన్, చంద్రన్న కానుకల పేరిట తన వందిమాగధులకే నాసిరకం సరుకుల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పించటం లేదా అని ప్రశ్నించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 791 పేజీల నివేదికలో రూ. 10,739 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నది వాస్తవం కాదా అన్నారు. రాష్ట్రం మొత్తంపై ఆస్తులను ఎడాపెడా తాకట్టుపెడుతున్నారు, సీఆర్‌డీఏ ద్వారా రూ. 11వేల కోట్లు అప్పులు చేసేందుకు ప్రయత్నాలు జరగటంలేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరిట సందర్శకులకు అల్పాహారం, భోజనం కోసం ఒక్కొక్కరికి రూ. 275 చెల్లిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ బంధువు నిర్వహిస్తున్న ఈ భోజనశాలలో 10 మంది వచ్చినా బస్సు నిండా జనం వచ్చినట్లు రికార్డుల్లో రాసుకోవడం లేదా అని ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయానికి సేకరించిన భూముల పరిహారంలో మోసపూరిత వేలిముద్రులు వేయించుకోటాన్ని హైకోర్టు తప్పుపట్టి అసైన్డ్ భూములకూ అందరిలా రూ. 28లక్షలు చొప్పున చెల్లించాలంటూ ఆదేశించలేదా అని కన్నా ప్రశ్నించారు.