ఆంధ్రప్రదేశ్‌

60 వేలమంది రైతులకు డీకేటీ పట్టాల పంపిణీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 8: నెల్లూరు జిల్లాలో 60,505 మంది రైతులకు 66 వేల 276 ఎకరాల సీజేఎస్‌ఎఫ్ భూములను డీకేటీ పట్టాలుగా మార్చి అందజేయడానికి చర్యలు తీసుకున్నామని ,జిల్లా అసెస్‌మెంట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పరిశ్రమలశాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. ఈమేరకు కలెక్టరేట్‌లో గురువారం జరిగిన జిల్లా అసెస్‌మెంట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడి అసైన్‌మెంట్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వివరాలు సేకరించి వాటిని పరిశీలించి లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఈప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు దీక్షతో అసెస్‌మెంట్ భూముల వివరాలు సేకరించడం పట్ల వారిని మంత్రి అభినందించారు. జిల్లాలో 15 వేల ఎకరాలకు పైబడి చుక్కల భూములున్నాయని, వాటిపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 1975 సంవత్సరంలో ఇచ్చిన సీజేఎఫ్‌ఎస్ భూములను పట్టా భూములుగా మార్చి ఇవ్వడం అభినందనీయమని, వీటి విలువ సుమారు 6,600 కోట్ల రూపాయల నుండి 10 వేల కోట్ల రూపాయల మేర ఉంటుందని అన్నారు. లబ్ధిదారులకు ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా పట్టాల పంపిణీకై అన్ని చర్యలు చేపట్టామన్నారు.
రైతులకు సాగునీరు
ఇదిలావుండగా గురువారం కలెక్టరేట్‌లో జరిగిన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో 3 లక్షల 20 వేల ఎకరాలకు పైబడి సాగునీరును అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. బోగోలు మండలం జువ్వలదినె్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకై 76 ఎకరాలను కేటాయించామని ఆయన వివరించారు.