ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరంకుశ, నియంత పాలన కొనసాగిస్తున్నారని దీనిని అంతమొందించేందుకు ప్రజలతో కలిసి ప్రతిఘటిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో తమ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డగించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, శాంతిభద్రతలకు భంగం కల్గించిన సమయంలో స్పందించాల్సిన పోలీసులు అధికార పక్షానికి తొత్తులు, గుమస్తాలుగా మారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
హౌస్ అరెస్ట్ అనంతరం గుంటూరులోని కన్నా స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావుపై పోలీసులు అరాచకంగా ప్రవర్తించారన్నారు. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటం పాల్పడటం రాష్ట్రంలోని రాక్షస పాలనకు అద్దంపడుతోందని విరుచుకుపడ్డారు. బీహార్‌లో లాలూరాజ్ మాదిరిగా ఏపీలో పోలీసుల రాజ్ నడుస్తుందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. సంఘ విద్రోహశక్తులను అడ్డుకోలేని పోలీసులు, చేతకాని చంద్రబాబు ప్రభుత్వం శాంతియుతంగా ఆందోళన చేసే తమపై ప్రతాపం చూపడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదన్న సత్యాన్ని పోలీసులు గుర్తెరగాలని హితవుపలికారు.
ఏపీలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్న విషయాన్ని ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నామని, తాజాగా జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజకీయ ప్రత్యర్థులను తొలగించే కుట్రకు ప్రభుత్వం పాల్పడుతోందని, అడ్డగించిన ప్రతీసారి తాము ప్రతిఘటిస్తూనే ఉంటామని కన్నా లక్ష్మీనారాయణ, జీవిఎల్ స్పష్టంచేశారు. విలేఖర్ల సమావేశంలో మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ నేతలు కన్నా, జీవీఎల్, కావూరి